Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి విందులో మెరిసిపోయిన అనుష్క చోకర్ నెక్లెస్.. ఖరీదు ఎంతంటే..!

  • ఢిల్లీలో నిన్న ఘనంగా పెళ్లి విందు
  • ఎరుపురంగు బెనారస్ చీర, చోకర్ నెక్లె స్ ధరించిన అనుష్క
  • నెక్లెస్ ఖరీదు దాదాపు రూ.25 నుంచి రూ.30 లక్షలు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి ఇటలీలోని టస్కనీలో జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలో నిన్న ఘనంగా వివాహ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విందులో ఎరుపు రంగు బెనారస్ చీరతో, చోకర్ నెక్లెస్ తో మెరిసిపోయిన అనుష్కపైనే అందరి దృష్టి పడింది. ముఖ్యంగా, ఈ నెక్లెస్ గురించే అందరూ చర్చించుకున్నారు.

ఇంతకీ, దీని ఖరీదు దాదాపు రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన దుస్తులనే అనుష్క తన పెళ్లిలో, నిన్న ఢిల్లీలో జరిగిన విందులో ధరించింది. కాగా, ఈ నెల 26న ముంబైలో కోహ్లీ జంట మరో విందు ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు ఈ జంట వెళుతుందని తెలుస్తోంది. కోహ్లీ-అనుష్క జంట ఆ పర్యటనలోనే నూతన సంవత్సరం వేడుకలను జరుపుకోనున్నట్టు సమాచారం.
Anushka Sharma
Virat Kohli

More Telugu News